• వేసవి సెలవుల నేపథ్యంలో కాకినాడ గ్రామీణంలోని సూర్యారావుపేట సముద్రతీరంలో ఉన్న శిల్పారామంలో 12 నుంచి 19వ తేదీ వరకు ‘శిల్పారామం కాకినాడ వేసవి ఉత్సవం-2019’ నిర్వహించనున్నారు. శ్రీభక్తాంజనేయ సురుచి ఫుడ్స్‌ సౌజన్యంతో రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఎనిమిది రోజులపాటు ప్రత్యేక సాంస్తృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని శిల్పారామం పరిపాలనాధికారి కృష్ణప్రసాద్‌ శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో ఉప పరిపాలనాధికారి అనూష, సురుచి ఫుడ్స్‌ సీఈవో వర్మ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.