You are here

Smart City Project Works Worth 400 Crores will be Inaugurated by CM Tomorrow at Kakinada - Collector

Smart City Project Works Worth 400 Crores will be Inaugurated by CM Tomorrow at Kakinada - Collector

 

 

 

 

 

నాలుగు వందల కోట్లతో కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులు:

ప్రతిష్టాత్మక స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కాకినాడ నగరంలో ఇప్పటివరకు 114 కోట్ల నిధులతో 11 అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి చేశామని, ప్రస్తుతం 257 కోట్ల నిధులతో 18 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. మరో 460 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రతిపాదించగా వీటిలో టెండర్ల ప్రక్రియ ఖరారైన 400 కోట్ల పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు శంకుస్థాపన చేస్తారని తెలియజేశారు. ఇందులో భాగంగా 30 కోట్ల నిధులతో 1800 సీటింగ్ కెపాసిటీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్  సదుపాయాలతో గోదావరి కళాక్షేత్రం, 20 కోట్ల నిధులతో పిల్లల్లో శాస్త్ర విజ్ఞానం పెంపొందించే సైన్స్ సెంటర్, ఎనిమిది రకాల క్రీడలను నిర్వహించేందుకు వీలుగా 17 కోట్లతో కన్వర్టబుల్ ఇండోర్ స్టేడియం లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. నగరవాసులకు స్మార్ట్ పాలన అందించే లక్ష్యంగా కమాండ్ కంట్రోల్ సెంటర్, సిస్టం ఇంటిగ్రేషన్ వ్యవస్థ, 120 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ వ్యవస్థలను అభివృద్ధి చేశామని, ఈ పనులను స్టెర్ లైట్ టెక్ సంస్థ సమర్థవంతంగా పూర్తిచేసిందన్నారు. నగరంలో 640 లొకేషన్లలో సెన్సార్ కంట్రోల్డ్ స్మార్ట్ లైట్లు, 350 లొకేషన్లలో సీసీటీవీ కెమెరాలు, 5 లొకేషన్లలో డిస్ప్లే, 470 లొకేషన్లలో ఫ్రీ వైఫై ఏర్పాటు చేశామన్నారు. నగర రహదారిలో 10 చోట్ల ట్రాఫిక్ రెడ్లైట్లు ఉల్లంఘనలలో నంబర్ ప్లేట్ డిటెక్షన్ పాయింట్లను ఏర్పాటు చేశామని, డెన్సిటీని గుర్తించి ట్రాఫిక్ ను రేగులతె చేసే అడాప్టివ్  ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను సర్పవరం నుండి బాల యోగి విగ్రహం వరకు చేపట్టిన స్మార్ట్ రోడ్డులో  వినియోగంలోకి తెస్తున్నామన్నారు. నేరాలను అరికట్టేందుకు మేజర్ జంక్షన్లలో హై జూమ్ కెమెరా వ్యవస్థలతో పేస్ రెకొగ్నిషన్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 30 ప్రదేశాలలో ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రస్ వ్యవస్థలు ఇటీవల ఫెతాయి తుఫాన్ సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు దోహదమయ్యాయన్నారు. నిండిన వెంటనే సమాచారం అందించి ఎప్పటికప్పుడు క్లియర్ చేసేందుకు వీలుగా సెన్సార్లు అమర్చిన స్మార్ట్ డస్ట్ బిన్ లు నగరంలో ప్రవేశపెట్టామన్నారు.

 

పూర్తికావచ్చిన 216 జాతీయ రహదారి ఫేస్ 1:

216 జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టు తొలిదశ క్రింద చేపట్టిన కత్తిపూడి కాకినాడ రహదారి ఫిబ్రవరి మాసాంతానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. పనులు దాదాపు పూర్తయి ఈ రహదారి చాలా మేరకు ప్రజా వినియోగంలో వచ్చిందని, పిఠాపురం రైల్వే ఫ్లైఓవర్ కాంక్రీట్ పనులు జరుగుతున్నాయన్నారు. ఈ రహదారి వల్ల ప్రజలు అన్నవరం, విశాఖపట్నం వెళ్లేందుకు పట్టే సమయం గణనీయంగా తగ్గుతుంది అన్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ రెండు, మూడు, నాలుగు దశల పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి అన్నారు. జిల్లా ముఖ చిత్రంపై సుందరంగా రూపుదిద్దుకుంటున్న ఈ జాతీయ రహదారిని రాష్ట్ర ముఖ్యమంత్రి శుక్రవారం హెలికాప్టర్ ద్వారా విహంగవీక్షణం తెస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Advertisement

Share this content.