You are here

Smart Facilities are Available to Kakinada Smart City People - Collector Kartikeya Mishra

Smart Facilities are Available to Kakinada Smart City People - Collector Kartikeya Mishra

 

 

 

 

 

 

 

 

స్మార్ట్ సిటీ కన్వర్జెన్సీ ప్రణాళికల ద్వారా కాకినాడ నగరంలో సుమారు రెండు వేల కోట్ల నిధులతో 65 అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు.

నేడు రాత్రి స్థానిక రాజ ట్యాంక్ ఆవరణలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (ccc) లో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల 4వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించిన ఈ సెంటర్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన స్మార్ట్ ఫెసిలిటీలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ నగర ప్రజలకు మెరుగైన పౌర జీవన వసతుల కల్పన లక్ష్యంగా ccc ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఇందిరా భాగ్యనగరంలో 120 కిలోమీటర్ల పొడవైన ఫైబర్ నెట్ వ్యవస్థను విస్తరించి 470 ప్రదేశాలలో ఉచిత వైఫై జోన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

 

 

 

 

అలాగే నగరంలోని 350 కీలక ప్రదేశాలలో ఏర్పాటుచేసిన హాయ్ రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాతో ccc కేంద్రం ద్వారా భద్రత ట్రాఫిక్ వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఏవైనా సమస్యలు ఎదురైతే తక్షణ చర్యలు చేపట్టేందుకు వీలవుతుందన్నారు. 10 చోట్ల నెలకొల్పిన హై స్కూల్ ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు నేరాలు నియంత్రిస్తున్నామని, ఇప్పటి వరకు 15 కేసులలో కీలక సమాచారం ఈ వ్యవస్థ ద్వారా పోలీసు శాఖకు అందించడం జరిగిందన్నారు. 25 చోట్ల ఎమర్జెన్సీ కాల్ బాక్స్లు నెలకొల్పుతున్నామని, ఆపదలో ఉన్న వారు ఈ బాక్స్లనుండి అందించే సమాచారంతో సి సి సి సెంటర్ తక్షణ సహాయ రక్షణ చర్యలను ఏర్పాటు చేస్తుందన్నారు. సర్పవరం నుండి బాలయోగి విగ్రహం వరకు చేపట్టిన స్మార్ట్ రోడ్ లోని నాలుగు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామని, రద్దీని బట్టి ట్రాఫిక్ను ఈ వ్యవస్థ నియంత్రిస్తుంది అన్నారు. అలాగే 20 చోట్ల ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ డిటెక్షన్ రికార్డింగ్ నిఘా ఏర్పాటు చేస్తున్నామని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి వారి ఇంటికి చలానా పంపి జరిమానా వసూలు చేయడం జరుగుతుందన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన 640 స్మార్ట్ స్ట్రీట్ లైట్ ల వల్ల విద్యుత్ గణనీయంగా ఆదా అవుతుందన్నారు. అలాగే 110 ప్రాంతాల్లో స్మార్ట్ బిన్ లను నెలకొల్పామని, నిండిన వెంటనే పీసీసీ సెంటర్కు అక్కడనుండి కార్పొరేషన్ సిబ్బందికి సమాచారం చేరి ఎప్పటికప్పుడు చెత్త తొలగింపు చర్యలు చేపడుతున్నారన్నారు.

 

 

 

 

30 ప్రదేశాలలో ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రస్ వ్యవస్థ ద్వారా ఇటీవల ఫెతాయి తుఫాన్ సందర్భంగా ప్రజలకు హెచ్చరికలు, జాగ్రత్తలు జారీ చేసి అప్రమత్తం చేశామని, అత్యవసర సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయుక్తం గా ఉందన్నారు. సి సి సి కేంద్రంలో ఏర్పాటు చేసిన వర్చ్యువల్ స్టూడియో ద్వారా నగరంలోని పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ తరగతులు నిర్వహించే సదుపాయం అందుబాటులోకి వచ్చిందని, నగరపాలక సంస్థ పాఠశాలల్లో చదువుతున్న 15 వేల మంది విద్యార్థులకు లబ్ది కలుగుతోందన్నారు. నగరంలో పర్యావరణ హితమైన ఈ - బస్ ప్రజా రవాణా వ్యవస్థను ప్రవేశ పెట్టేందుకు ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నారన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ క్రింద ఇప్పటివరకు 11 అభివృద్ధి ప్రాజెక్టులను 114.92 కోట్ల నిధులతో పూర్తిచేశామని, 257.37 కోట్ల నిధులతో మరో 17 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయన్నారు. 360 కోట్ల అంచనాతో 17 పనులు టెండర్ దశలో ఉన్నాయని, 108 కోట్లు అంచనాతో మరో అయిదు పనులకు ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నామన్నారు. కాకినాడ నగర ప్రజల దైనందిన జీవితంలో అవసరమైన సేవలు, సమాచారంతో స్మార్ట్ సిటీ ఆఫ్ సిసిసి అందుబాటులోకి తెచ్చింది అన్నారు. సి సి సి సెంటర్ అందుబాటులో వచ్చిన సేవలను నగర కమిషనర్ కె.రమేష్ మీడియా ప్రతినిధులకు లైవ్ డెమో ద్వారా వివరించారు.

 

 

 

 

కాకినాడ తీరం లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో సి ఫ్రెండ్ తో మనోహరమైన రెసిడెన్షియల్ ఏరియల్ అభివృద్ధికి అనువైన స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా గూడ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 
నేడు రాత్రి ccc కేంద్రం సమావేశ హాలులో గుడా, రెవెన్యూ అధికారులతో సమావేశమై రెసిడెన్షియల్ ల్యాండ్ పూలింగ్ పై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ - కత్తిపూడి - అన్నవరం - ఏవీ నగరం బీచ్ మీదుగా తిరిగి కాకినాడ మధ్యనున్న షద్భుజి ప్రాంతంలో శరవేగంగా విస్తరిస్తున్న జాతీయ రహదారులు, ఎకనామిక్ జోన్, భారీ పరిశ్రమలు, నౌకాశ్రయాలు విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకనుగుణంగా పెరిగే జనాభా అవసరాల మేరకు రెసిడెన్షియల్ ప్రాంతం కూడా అభివృద్ధి చేయాలని తెలిపారు. ఇందుకు ఈ షద్భుజి ప్రాంతంలో సీ వ్యూ, ప్రకృతి రమణీయతతో ప్రజలు ఇష్టపడే తీరప్రాంతాలలో రెసిడెన్షియల్ ఏరియాలను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో అభివృద్ధికి ప్రతిపాదించామని, ఈ ప్రాంతంలో అనువైన ప్రభుత్వ, పోర్ట్, ఏపీఐఐసీ స్థలాలను గుర్తించి నివేదిక అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో గూడ వైస్ చైర్మన్ డా.అమరేంద్రకుమార్, కాకినాడ ఆర్డీవో బి. రాజకుమారి, పెద్దాపురం ఆర్డీవో వసంతరాయులు, తహశీల్దార్లు పాల్గొన్నారు.

Advertisement

Share this content.