• Tags
  • జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడిగా ఎలిశెట్టి సత్యసాయి రమేష్‌ ఎన్నికయ్యారు. ఈయన ప్రస్తుతం రావులపాలెం డీసీసీబీ బ్రాంచి మేనేజరుగా పనిచేస్తున్నారు. గతంలో డీసీసీబీ జిల్లా ఉద్యోగుల సంఘం కార్యదర్శిగా పనిచేశారు. కాకినాడలోని జిల్లా సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో రమేష్‌ తన పదవీ బాధ్యతలను స్వీకరించారు. డీసీసీబీ ఛైర్మన్‌ వరుపుల రాజా, సీఈవో మంచాల ధర్మారావు, తదితర కార్యవర్గ సభ్యులు, అధికారుల సహకారంతో బ్యాంకును లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు కృషిచేస్తానని రమేష్‌ అన్నారు.