• ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సొసైటీ రాష్ట్ర శాఖ వారు 2018-19 సం. నుండి వివిధ విభాగములలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన జూనియర్ మరియు యూత్ రెడ్ క్రాస్ పాఠశాల మరియు కళాశాలలకు అవార్డులు బహుకరించే కార్యక్రమం చేపట్టారని జిల్లా కార్యదర్శి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, కాకినాడ వారు ఒక ప్రకటనలో తెలిపారు.

  ఈ క్రింది విభాగములలో అవార్డులు బహుకరణ జరుగుతున్నది

  1) విద్యా సంస్థలలో పరిశుభ్రత, ఆరోగ్యకర పరిస్థితులు మరియు పచ్చదనం

  2) విద్యుత్ శక్తి ఇతర శక్తి వనరులు మరియు నీటి ఆదా 

  3) వ్యర్థ పదార్థాల నిర్వహణ 

  4) సామజిక సమస్యలపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ 

  గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి అవార్డులకు పోటీపడే విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులు జూనియర్ మరియు డిగ్రీ కాలేజీలు ప్రిన్సిపల్స్ ముందుగా ఈ విద్యా సంవత్సరం జూన్ 12వ్ తేదీ నుండి 24వ తేదీ లోగా ఈ వెబ్సైట్ http://indianredcross-ap.org/ లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందిగా రెడ్ క్రాస్ చైర్మన్ వై.డి.రామారావు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసినారు. ఇతర వివరాములకు 9294002992 లేదా 08842371409 సంసంప్రదించవలిసినదిగా కోరారు.