You are here

Success story of AFC ( Advanced Foundation Course ) school of KMC

Success story of AFC ( Advanced Foundation Course ) school of KMC

 

 

 

కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక శ్రీనగర్ నందు నగరపాలక సంస్థల పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధిని, విద్యార్ధులకు ప్రభుత్వమువారి ఆదేశములకు లోబడి అన్ని ఉన్నత ప్రమాణాలతో,ఆధునిక వసతులతో,కార్పోరేట్ విద్యా భోధనకు ధీటుగా విద్యను అందించు ఉద్దేశ్యంతో నూతన విధ్యభోదనను 2016 వ సంవత్సరము నుండి అడ్వాన్సుడ్ ఫౌండేషన్ కోర్స్ ను ప్రారంభించుట జరిగినది. సదరు అడ్వాన్సుడ్ ఫౌండేషన్ కోర్స్ (A F C ) వివరములలోకి వెళితే ప్రకృతి ప్రసాదించిన ప్రతిభా సామర్థ్యాలు కలిగి ఉండి, ప్రోత్సహించే పెన్నిధి, సన్నిధి లేక మట్టిలో పుట్టి మెరుగుదల, పెరుగుదల నోచుకోక మరుగు నొంది పోయే మాణిక్యాలు ఎందరో. అలాంటి వారికి ఆశాకిరణమై ఆపన్నహస్తమై నిలిచిందే ఈ “అడ్వాన్సుడ్ ఫౌండేషన్ కోర్స్ (A F C )” స్కూల్. మిగతా పిల్లల కన్నా మించిన తెలివితేటలుండి, అవకాశాలు అందిస్తే చాలు ఆకాశానికి దూసుకెళ్లే సత్తా ఉండి, చెల్లాచెదురుగా పడివున్న చిచ్చరపిడుగు లాంటి పిల్లందరినీ ఒకే చోట చేర్చి వారిలో ప్రతిభని, లోతైన పుస్తక విజ్ఞానాన్ని బోధనతో పదునుపెట్టి దేశంలో జరిగే ఏ పోటీ పరీక్షకైనా ఆత్మవిశ్వాసంతో, అనుభవాలతో ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్ది వారి భవిష్యత్తు బంగారు వాకిలి తెరిచే ఓ బృహత్ పధకమే. “అడ్వాన్సుడ్ ఫౌండేషన్ కోర్స్ (A F C )” స్కూల్. మున్సిపల్ పాఠశాలల్లో చదివే విద్యార్దులైయుండి, మిగతా వారికన్నా చదువులో తెలివితేటలలో కాస్తంత ముందుకివేళ్ళ గలిగే సామర్థ్యమున్న ఇక్కడికి వచ్చే విద్యార్థులు. ఓ చిన్న ప్రవేశ పరీక్ష ద్వారా నిరూపించుకొని ఈ పాఠశాలలోకి ప్రవేశం సంపాదిస్తారు.

 

 

ప్రవేశ పరీక్షలో చూపే ప్రతిభ పెట్టుబడిగా మారి, చదివే విద్యార్థులకు బయట ఐఐటి ఫౌండేషన్, కెరియర్ ఫౌండేషన్, పేరిట వేలు, లక్షలు పోసి పొందే విద్యని. ఇక్కడ అందుకోవటానికి రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ప్రవేశం పొందిన విద్యార్థులకు వారి స్కూల్లో పొందే అన్ని ఉచిత సౌకర్యాలతో పాటు అడ్వాన్సుడ్ పౌండేషన్ కోర్సు కు ఉద్దేశించిన అన్ని పుస్తకాలు ఉచితంగా అందిస్తారు. పేరుకు కార్పోరేషన్ పాఠశాల అయినా కార్పొరేట్ విద్యాసంస్థల వాతావరణం ఇక్కడ బోధనలో, బోధనని, చదువుని ఎప్పటికప్పుడు మదింపు చేసే వారంత పరీక్షలో, ఆ పరీక్షలతో తమ ప్రతిభను రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు రూపంలో చూపాలనుకునే విద్యార్థుల తాపత్రయం కనబడకుండానే కనిపిస్తూ ఉంటుంది.

 

Advertisement

Share this content.