• Tags
  • The Hon'ble City MLA Shri Dwarampudi Chandrasekhar Reddy has started training classes for the recruited volunteers to perform the functions of the city governing body at the Jagannathpuram Gandhi School under the Kakinada Municipal Corporation. Speaking on the occasion,he mentioned that the public administration to cooperate with their people in various parts of the city, but Ward volunteers are near to poor people and to serve the poor. This will take place from 6-8-19 till 9-8-19, He urged the government to make good use of the training by listening to the training classes and learning about public issues.

     

    కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గల జగన్నాధపురం గాంధీ స్కూల్లో నగర పాలక సంస్థ విధులు నిర్వహించే నిమిత్తం వాలంటరీలుగా నియామకం కాబడిన అభ్యర్థులకు శిక్షణ తరగతులను గౌరవ నగర శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో వివిధ ప్రాంతాల వారి ప్రజలతో ప్రజాప్రతినిధులు అధికారులు పరిపాలన అందించుటకు సహకరించడం జరుగుతుందని కానీ కేవలం పేద ప్రజల మధ్య ఉంటూ వారికి సేవలు చేసే అవకాశం వార్డు వాలంటరీలకు ఉందని పిలుపునిచ్చారు, గౌరవ వేతనం తక్కువ అయినప్పటికీ సంతృప్తినిచ్చే పనిని ఎంచుకున్నందుకు ఎంపిక కాబడిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.6-8-19 నుండి 9-8-19 వ తేదీ వరకు జరిగే ఈ శిక్షణ తరగతులను శ్రద్ధగా విని ప్రజా సమస్యలను సంబంధిత అధికారులకు తెలిపే విధానం నేర్చుకొని ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు.