You are here

Ysrcp Samara Shankaravam at Sarpavaram Kakinada | Y.S.Jagan Mohan Reddy

Ysrcp Samara Shankaravam at Sarpavaram Kakinada - Y.S.Jagan Mohan Reddy Participated in this program

 

 

 

 

 

 

 

 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వేదికగా సోమవారం ఎన్నికల సమర శంఖారావం పూరించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచే మార్పునకు నాంది పలుకుతూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాకినాడలో వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేసిన సమర శంఖారావ సభకు హాజరైన  అశేష జనసముహాన్ని ఉద్దేశించి జననేత వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తున్నారు. సమర శంఖారావం వేదికపై నుంచి వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసారు.

 

 

రేపు వైఎస్సార్‌సీపీ 9వ ఆవిర్భావ దినోత్సవం అని తరలి వచ్చిన ప్రజనీకానికి తెలియజేసారు. భారీగా తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. తొమ్మిదేళ్లుగా మీరందరూ నాకు అండగా నిలిచారని, అధికార పార్టీ మిమ్మల్ని ఎంతగా బాధపెట్టిందో నాకు తెలుసుని, మీకు తగిలిన ప్రతి గాయం నా గుండెకు తగిలిందని అయన అన్నారు. అధికారంలోకి రాగానే వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు ఎత్తివేస్తాం అని తెలియజేసారు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన అందిస్తామని, దోపిడీకి పాల్పడ్డ టీడీపీకి శాంతియుతంగా సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే రాజన్న రాజ్యం రావాలని అయన అన్నారు. వైఎస్సార్‌సీపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అయన కోరారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని, నిరుద్యోగ భృతి పేరుతో యువతను దగా చేశారని అయన అన్నారు. టీడీపీ అవినీతి పాలనపై, మేనిఫెస్టోలో ఇచ్చిన 600 మోసపూరిత హామీలపై ప్రతి కుటుంబంలో చర్చ జరగాలని 
టీడీపీ ప్రభుత్వం ఇసుక నుంచి గుడి భూముల వరకు దేన్నీ వదలలేదని అయన అన్నారు. చివరకు మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా అవినీతే చోటుచేసుకుందని, చంద్రబాబు రాక్షస పాలనపై గ్రామాల్లో చర్చ జరగాలని అయన అన్నారు.

 

 

  • చదువుకు, పేదరికానికి సంబంధం లేకుండా చేస్తా.
  • మీ పిల్లల చదువుకోసం.. ఎన్ని లక్షల ఖర్చైనా నేను చదివిస్తా.
  • చదువుకునేటప్పుడు పిల్లలు హాస్టల్‌లో ఉంటే.. ఏడాదికి 20వేల రూపాయలు ఇస్తాం.
  • చిన్న పిల్లలను స్కూలుకి పంపిన తల్లులకు ఏడాది 15వేల రూపాయలు అందజేస్తాం.
  • వైఎస్సార్‌ చేయూత కింద ప్రతి అక్కకు నాలుగు దఫాలుగా 75వేల రూపాయాలు.
  • ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలు నాలుగు దఫాల్లో మాఫీ
  • రైతు భరోసా కింద ప్రతి ఏడాది మే నెలలో ప్రతి రైతుకు రూ.12,500
  • పింఛన్‌ రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు పెంచుతాం.
  • నవరత్నాలతో ప్రతి మనిషి జీవితంలో వెలుగు చూస్తాం.
  • మన గుర్తు ఫ్యాన్‌ గుర్తు అని చెప్పండి.
  • వచ్చేది రాజన్న రాజ్యమని.. వచ్చేవి అన్నీ మంచి రోజులని చెప్పండి.

Advertisement

Share this content.