• బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ తన మంచి మనసును చాటుకుంటున్నారు. నిన్న తన వద్ద 40 ఏళ్ల పాటు పనిచేసిన సహయకుడి అంత్యక్రియలను దగ్గరుండి జరిపించిన అమితాబ్..తాజగా తను రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారు.  అప్పులు తీసుకుని తీర్చలేని స్థితిలో ఉన్న బిహార్‌కు చెందిన దాదాపు 2100 మంది  రైతుల అప్పులను బిగ్‌బి తీర్చారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘నేను ముందుగా ప్రామిస్‌ చేసినట్లుగానే బిహార్‌కు చెందిన 2100 రైతులను ఎంపికచేసి వారి అప్పులను తీర్చేశాను. కొందరి అప్పులను నేరుగా బ్యాంకుల్లోనే వేసేశాను. మరికొందరిని నా నివాసానికి పిలిపించి అభిషేక్‌, శ్వేత చేత చెక్కులు అందించాను’ అని పేర్కొన్నారు.

    గతంలోనూ ఇలా అప్పులబారిన పడిన ఎందరో రైతులను అమితాబ్‌ ఆదుకున్నారు. గతేడాది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వెయ్యి మంది రైతులకు దాదాపు రూ.5.5 కోట్లతో రుణమాఫీకి సాయం చేశారు.