• Tags
  • జిల్లాలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని, అవసరమైన అన్ని అనుమతులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అందజేస్తున్నామని జిల్లా పరిశ్రమల శాఖ సంయుక్త సంచాలకుడు ఏవీ పటేల్‌ తెలిపారు. కాకినాడ గ్రామీణంలోని రమణయ్యపేటలో ఉన్న కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బజినెస్‌ అవుట్‌ రీచ్‌’ కార్యక్రమంపై కార్యశాల నిర్వహించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యాలయం డీడీ ఆదివిష్ణు, కాలుష్య నియంత్రణ మండలి, ఏపీఐఐసీ తదితర శాఖల ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పారిశ్రామిక వేత్తల సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను అధిగించేందుకు ఆయా విభాగాల వారీగా సూచనలు చేశారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఆన్‌లైన్‌ అనుమతులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రామారావునాయుడు, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ సుధాకర్‌, పరిశ్రమల శాఖ డీడీ డేవిడ్‌ సుందరకుమార్‌ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.