• దేశ స్థాయిలో వన్నెలాడి కోసం జరిగే పోటీల్లో మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్ సుందరి సుమన్ రావు (20) దక్కించుకుంది. శనివారం (జూన్ 15, 2019) ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గతేడాది విజేత తమిళనాడుకు చెందిన మాజీ మిస్ ఇండియా అనుకీర్తి వాస్.. సుమన్ రావుకి అలంకరించింది. 

    రెండో స్థానాన్ని తెలంగాణకు చెందిన సంజనా విజ్ దక్కించుకున్నారు. లాస్ట్ ఇయర్ రన్నరప్‌ గా హర్యానాకు చెందిన మీనాక్షీ చౌదరి ఈ ఇయర్ రన్నరప్‌ కి తన కిరీటాన్ని బహూకరించింది. అలాగే 2018లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన శ్రేయా రావు.. తన కిరీటాన్ని తెలంగాణకు చెందిన సంజనా విజ్‌ కి తొడిగింది. మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2019గా బీహార్‌కి చెందిన శ్రేయా శంకర్ నిలవగా మిస్ గ్రాండ్ ఇండియా 2019గా ఛత్తీస్‌ గఢ్‌కి చెందిన శివానీ జాదవ్ నిలిచింది.

    ఈ ఈవెంట్ కి బాలీవుడ్ స్టార్లు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తదితరులు కూడా హాజరయ్యారు.  బాలీవుడ్ ఫేవరెట్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, మనీష్ పాల్, మిస్ వరల్డ్ 2017 మానుషీ చిల్లర్ కలిసి ఈ ఈవెంట్‌కి హోస్ట్స్‌గా వ్యవహరించారు. ఫెమినా మిస్ ఇండియా 2019 కు మొత్తం 30 మంది అందమైన అమ్మాయిలు తమ తమ రాష్ట్రాల నుంచీ ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. కొన్ని నెలలుగా హార్డ్ వర్క్ అనంతరం వాక్, ఫిట్‌నెస్, హెల్త్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టారు.