• చిన్నారుల చిట్టిపొట్టి చేతులతో..సుతిమెత్తని పాదాలతో మసాజ్ చేయించుకోవాలనుకుంటున్నారా..వాళ్లు మీ మాట వినటం లేదా..ఐతే ఈ ఐడియా ట్రై చేయండి..టీ షర్ట్ పై రైల్వే ట్రాక్‌..హాయినిచ్చే మసాజ్ మీ సొంతం..చిన్నారులకు ఆట..మీకు మసాజ్ ఒకే సారి. 

    మసాజ్..అలసిపోయినప్పుడు మసాజ్ చేయించుకుంటే అబ్బా..హాయిగా ఉంటుంది కదూ. దీని కోసం మసాజ్ సెంటర్లు రెడీగా ఉన్నాయి. కానీ చిన్నారులతో కాళ్లు తొక్కించుకోవటం..బోర్లా పడుకుని వీపుపై తొక్కించుకోవటం చేయించుకుంటుంటారు (చిన్నారులు చేసే మసాజ్) చాలామంది. అలా చేయించుకునేందుకు వారికి చిన్న చిన్న ఆశలో పెట్టి మరీ చేయించుకుంటుంటారు. కానీ ఓ పట్టాన వారు మాట వినరు కదా..ఆడుకోవాలనీ..హోం వర్క్ చేసుకోవాలని వంకలు చెబుతుంటారు. వారు కుదురుగా ఒక చోట ఉండరు. అటువంటి చిలిపి  చిన్నారులతో మసాజ్ చేయించుకోవటానికి ఓ ఫాదర్ మంచి ఐడియాను కనిపెట్టాడు. మరి ఆ స్మార్ట్ డాడీ ఐడియా ఏంటో తెలుసుకుందాం..

    పిల్లలతో మసాజ్ చేయించుకోవటానికి ఓ టీషర్ట్ ను డిజైన్ చేయించాడు. తన టీ షర్ట్ మీద రైల్వే ట్రాక్ డిజైన్ వేయించాడు. తరువాత తన బుజ్జి కుమారుడికి ఓ ట్రైన్ బొమ్మ కొనిచ్చాడు. తరువాత తాను బోర్లా పడుకుని తన టీషర్ట్ పై ఉండే రైల్వే ట్రాక్ పై నీ టాయ్ ట్రైన్ తో ఆడుకోమని చెప్పాడు. ఇంకేముంది ఆ బుడతడు ఎగిరి గంతేసాడు..తన ట్రైన్ కు ఓ ట్రాక్ దొరకిందని. 

    చుక్..చుక్..చుక్ అంటే తండ్రి వీపుపై ఉన్న ట్రాక్ (టీషర్ట్ డిజైన్)పై తన ట్రైన్ టాయ్ తో ఆడేసుకుంటున్నాడు.చూశారా..ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు..తండ్రికి మసాజ్..కొడుకుకి ఆట. మరి మీరు కూడా చైల్డ్ మసాజ్ కావాలంటే ఇటువంటి డిజైన్ షర్ట్ వేసుకోండి..మసాజ్ చేయించుకోండి. మీకు మసాజ్..పిల్లలకు ఆట రెండు ఒకేసారి భలే బాగుంది కదూ..ఈ మసాజ్ ఐడియా. 

    ఆ..ఆ ఇంతకీ ఈ ట్రైన్ ట్రాక్ టీ షర్ట్ ఐడియా ఎవరు వేశారు..వారు ఎచటివారు అనే విషయం చెప్పనే లేదు కదూ..జపాన్‌కు చెందిన కెన్ కవమాటోకు వచ్చిన ఐడియా గురించి తప్పకుండా తెలుసుకోవల్సిందే.  మరి మీకూ ఇలాంటి టీషర్టు కావాలా? నాయనా..