• ప్రముఖ డీటీహెచ్ సర్వీసు ప్రొవైడర్ టాటా స్కై నుంచి కొత్త సర్వీసు వచ్చేసింది. ‘Binge’ ఎడిషన్ స్ట్రీమింగ్ యాప్ సర్వీసు పేరుతో సరికొత్త డిజిటల్ ప్లాట్ ఫాంను ప్రవేశపెట్టింది. ఈ సర్వీసు ద్వారా డీటీహెచ్ యూజర్లు మల్టీపుల్ యాప్స్ నుంచి డిజిటల్ కంటెంట్ ను ఒకేసారి వీక్షించవచ్చు. ఈ కొత్త సర్వీసు యాక్సస్ చేసుకోవాలంటే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ (Amazon Fire TV Stick) టాటా స్కై ఎడిషన్ సబ్ స్ర్కిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సింగల్ ప్లాట్ ఫాంపై సింగల్ సబ్ స్ర్కిప్షన్ ఫీజుతో ఒకేసారి వివిధ యాప్స్ నుంచి డిజిటల్ కంటెంట్ స్ట్రీమింగ్ యాక్సస్ చేసుకోవచ్చు. 

  నెలకు రూ.249 మాతమ్రే :
  Tata Sky సబ్ స్ర్కైబర్లకు మాత్రమే ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఈ సర్వీసు యాక్సస్ చేసుకోవాలంటే ఒక్కో యూజర్ నెలకు రూ.249 చెల్లించాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం యాక్సస్ చేసుకునే టీటీహెచ్ యూజర్లకు 30 రోజుల పాటు ఫ్రీ ట్రయల్ ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. టాటా స్కై డీటీహెచ్ యూజర్ల అకౌంట్ నుంచి సబ్ స్ర్కిప్షన్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. బింగే కొత్త సర్వీసు యాక్సస్ చేసుకునే యూజర్లకు అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఉచితంగా ఆఫర్ ఇస్తోంది. దీనికి అదనంగా ఎలాంటి పేమెంట్ చేయనవసరం లేదు. 

   

  అమెజాన్ ప్రైమ్.. 3 నెలలు ఉచితం :
  టాటా స్కై కొత్త సబ్ స్ర్కైబర్లు.. అమెజాన్ ప్రైమ్ సర్వీసును 3 నెలల పాటు ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు. ఈ సర్వీసు ప్రారంభంలో యూజర్లు సింగల్ సబ్ స్ర్కిప్షన్ ఫీజుతో స్ట్రీమింగ్ యాప్స్ హాట్ స్టార్, సన్ ఎన్ఎక్స్ టీ,ఎరోస్ నౌ, హంగామా ప్లే (ఓటీటీ ప్లాట్ ఫాం) నుంచి డిజిటల్ కంటెంట్ ప్రొగ్రామ్స్ యాక్సస్ చేసుకోవచ్చు. టాటా స్కై అందించే మరో సర్వీసు నుంచి 5వేల టైటిల్స్ వీడియో ఆన్ డిమాండ్ (VOD) లైబ్రరీతో పాటు గతవారం ఫేవరెంట్ టీవీ షోలను కూడా వీక్షించవచ్చు.

  బాలీవుడ్ సినిమాలు,హాలీవుడ్ సినిమాలు, రీజనల్ సినిమా, వెబ్ సిరీస్, క్రికెట్ కు సంబంధించిన డిజిటల్ కంటెంట్ ను మిక్స్ యాప్స్ ద్వారా పొందవచ్చు. టాటా స్కై బింగే లో.. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ టాటా స్కై ఎడిషన్, అలెక్సా వాయిస్ రిమోట్ తోపాటు టాటా స్కై బింగే యాప్ ప్రీ ఇన్ స్టాల్ అయి ఉంటుంది.  ఫైర్ టీవీ స్టిక్ క్వాడ్ కోర్ CPU పవర్ తో పాటు Wi-Fi కనెక్టవిటీ ఆఫర్ చేస్తోంది. స్ట్రీమింగ్ కంటెంట్ ఫిక్చర్ క్వాలిటీ కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 

   

  గమనిక: టాటా స్కై బింగే సర్వీసు వైఫై యాక్టీవ్ గా ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. డీటీహెచ్ యూజర్ల TV setలో HDMI పోర్ట్ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు ఈ సర్వీసును ఈజీగా యాక్సస్ చేసుకోనే అవకాశం ఉంది.