• మాచో స్టార్ గోపిచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ హీరో హీరోయిన్స్‌గా, తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో, ATV సమర్పణలో, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న సినిమా 'చాణక్య'.. గోపీచంద్ బర్త్‌డే సందర్భంగా, బర్త్‌డే విషెస్ చెబుతూ, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

    క్రౌడ్‌లోనుండి నడుచుకుంటూ వస్తున్న గోపిచంద్‌ని ఫోకస్ చేస్తూ ఫస్ట్ లుక్ డిజైన్ చేసారు. ఇటీవల ఇండియా, పాకిస్థాన్ బోర్డర్‌లో గల జైసల్మేర్ పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ షెడ్యూల్ జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుంది.

    స్పై థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చాణక్య, హీరోగా గోపిచంద్ 26వ సినిమా.. కెమెరా : వెట్రి, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం : విశాల్ చంద్రశేఖర్, మాటలు : అబ్బూరి రవి.