• Tags
  • అంతర్జాతీయ క్రికెట్‌లో మెగా ఈవెంట్ అయిన వరల్డ్ కప్ టోర్నీ మరి కొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభం కానుంది. ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో టోర్నీ ఆరంభించనున్న ఈవెంట్‌పై భారీగా ఏర్పాట్లు చేపట్టారు. ఈ సారి టోర్నీకి ఫేవరేట్లుగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఇండియాలు కనిపిస్తున్నాయి. 

    ఇక వెస్టిండీస్, అఫ్ఘనిస్తాన్‌లు అంచనాలేమీ లేకుండానే బరిలోకి దిగుతున్నాయి. ఇంగ్లాండ్ వేదికగా 1975లో జరిగిన తొలి వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన వెస్టిండీస్ ఈ సారి టోర్నీకి అర్హత సాధించేందుకు తీవ్రంగా శ్రమించింది. ఇప్పటివరకూ జరిగిన 10వరల్డ్ కప్ టోర్నీల్లో 5సార్లు కప్ గెలుచుకుని సక్సెస్‌ఫుల్ జట్టుగా దూసుకెళ్తోంది ఆస్ట్రేలియా. 

     వరల్డ్ కప్ 1975(విజేత-వెస్టిండీస్)
     వరల్డ్ కప్ 1979(విజేత-వెస్టిండీస్)
     వరల్డ్ కప్ 1983(విజేత-ఇండియా)
     వరల్డ్ కప్ 1987(విజేత-ఆస్ట్రేలియా)
     వరల్డ్ కప్ 1992(విజేత-పాకిస్తాన్)
     వరల్డ్ కప్ 1996(విజేత-శ్రీ లంక)
     వరల్డ్ కప్ 1999(విజేత-ఆస్ట్రేలియా)
     వరల్డ్ కప్ 2003(విజేత-ఆస్ట్రేలియా)
     వరల్డ్ కప్ 2007(విజేత-ఆస్ట్రేలియా)
     వరల్డ్ కప్ 2011(విజేత-ఇండియా)
     వరల్డ్ కప్ 2015(విజేత-ఆస్ట్రేలియా)

    1987, 1999, 2003, 2007, 2015లలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచి చరిత్ర లిఖించగా, ఇండియా, 1983 తర్వాత 2011లో రెండుసార్లు, ఆరంభంలో వరుసగా వెస్టిండీస్ 2సార్లు ట్రోఫీ గెలుచుకుంది.

     

    You may also like:

    Worldcup 2019 Result

    World Cup 2019 Points Table

    Icc Worldcup 2019 song released watch it

    Indian team will fly to England on 22nd May for World Cup 2019

    World Cup is coming to India says Sachin Tendulkar

    Worldcup 2019 full schedule