• Tags
  • మరో 10రోజుల తర్వాత అంటే మే30న మొదలుకానున్న వరల్డ్ కప్ సందర్భంగా అఫీషియల్ సాంగ్‌ను విడుదల చేసింది ఐసీసీ. ప్రమోషన్ సాంగ్‌లో భాగంగా చేసిన ఈ పాట చిత్రీకరణకు బ్రిటిష్ బ్యాండ్‌ను వైవిధ్యంతో కూడిన సంగీతాన్ని అందించగా లారిన్ అనే కొత్త ఆర్టిస్ట్ భావానికి ప్రాణం పోశాడు. 

    పాట మొత్తంలో గ్రౌండ్స్ మాత్రమే కాకుండా వేర్వేరు సిటీలు కూడా రిప్రజెంట్ అయ్యేలా సాంగ్ చిత్రీకరించారు. అంతర్జాతీయ స్థాయిలో జరగనున్న ఈ ఈవెంట్‌లో 10 జట్లను టోర్నమెంట్‌కు ఎంపిక చేశారు. తొలి మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌లోని ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ ఆడనున్నాయి. 

    మే30 నుంచి జులై 14వరకూ జరగనున్న టోర్నీలో 48 మ్యాచ్‌లు జరుగుతాయి. 10సార్లు జరిగిన వరల్డ్ కప్‌లో 5సార్లు ఆస్ట్రేలియానే కప్ గెలుచుకుంది. 2సార్లు ఇండియా, 2సార్లు వెస్టిండీస్ ట్రోఫీలను దక్కించుకోగా శ్రీలంక ఒక్కసారి మాత్రమే టైటిల్ దక్కించుకుంది.  

     

    You may also like:

    Worldcup 2019 Result

    World Cup 2019 Points Table

    Icc World Cup Winners List

    Indian team will fly to England on 22nd May for World Cup 2019

    World Cup is coming to India says Sachin Tendulkar

    Worldcup 2019 full schedule

  • LORYN - Stand By (#CWC19) (Official Video) ft. Rudimental