• Tags
  • ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రైల్వే ఈ-టికెట్లపై 50శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఐఆర్ సీటీసీ ద్వారా రైలు టికెట్ బుక్ చేసుకున్న సీనియర్ సిటిజన్స్ సహా పలువురికి టికెట్ ధరపై రాయితీ అందిస్తోంది. ఈ డిస్కౌంట్.. సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు, విద్యార్థులు, డాక్టర్లు, మీడియా ప్రతినిధులు, క్రీడాకారులు, యుద్ధంలో భర్తను కోల్పోయిన మహిళలకు వర్తిస్తుందని ఐఆర్ సీటీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

    60 ఏళ్లుకు పైన వయసు ఉన్న మగవారు, 58ఏళ్లు, ఆపై వయసు ఉన్న మహిళలు ఈ తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. మెయిల్, ఎక్స్‌ప్రెస్, రాజధాని, శతాబ్ది, జన్ శతాబ్ది వంటి ట్రైన్లలో మాత్రమే ఈ టికెట్ల ధరపై డిస్కౌంట్ అందుబాటులో ఉంది.   

    IRCTC e-ticketing, www.irctc.co.in వెబ్‌సైట్లో సీనియర్ సిటిజన్స్, ట్రైన్ టికెట్ బుకింగ్స్‌పై రాయితీని పొందొచ్చు. ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్స్, రిజర్వేషన్ ఆఫీసుల్లోనూ ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ట్రైన్ టికెట్ ధరపై పురుషులు 40 శాతం వరకు, మహిళలు 50 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.