• రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు విమాన సర్వీసులు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే అయిదు సర్వీసులు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇండిగో విమానయాన సంస్థ మరో సర్వీసును నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. ఈ నెల 12వ తేదీ నుంచి సర్వీసు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఇండిగో నాలుగు, ట్రూజెట్‌ ఒకటి చొప్పున సర్వీసులున్నాయి. కొత్త సర్వీసు అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌కు వెళ్లే విమానాల సంఖ్య ఆరుకు చేరుతుంది. ఇండిగో ఇప్పటికే చెన్నై, బెంగళూరు నగరాలకు ఒక్కొక్కటి చొప్పున సర్వీసులు నిర్వహిస్తోంది.