• Tags
  • ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తూ వస్తోంది. ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్ లో.. ఇటీవల యూజర్ల వాయిస్ కాల్ కు స్పైవేర్ కోడ్ ను పంపి హ్యాకింగ్ చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వాట్సాప్.. యూజర్ల ప్రైవసీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వాట్సాప్ యూజర్ల ప్రొఫైల్ ఫొటో ఫీచర్ ను ఎన్ క్రిప్ట్ చేసింది. యూజర్ ప్రొఫైల్ ఫొటో డౌన్ లోడ్ ఆప్షన్ డిలీట్ చేసింది.

    షేర్.. సేవ్ రెండూ డిజేబుల్డ్ :
    అంటే.. ఒక యూజర్ వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోను మరో యూజరు డౌన్ లోడ్ చేయడం.. సేవ్ చేయలేరు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ బీటా అప్ డేట్స్, WhatsApp బిజినెస్ Beta వెర్షన్ iOS 2.19.60.5 అప్ డేట్ లో ప్రొఫైల్ ఫొటో సేవ్ ఆప్షన్ తొలగించింది. Group Icons ఫొటోలు మాత్రం సేవ్ చేసుకోవచ్చు. వాట్సాప్ యూజర్ల కోసం అదనంగా మరో ఫీచర్ ను యాడ్ చేసింది.  ఈ ఫీచర్.. ప్రివ్యూ స్టిక్కర్లను నేరుగా నోటిఫికేషన్ సెంటర్ లోకి అనుమతిస్తుంది. కొత్త ప్రివ్యూ ఫీచర్.. iOS వాట్సాప్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

    షేర్ బటన్ కనిపించదు :
    ఇటీవల వాట్సాప్.. యూజర్లకు తమ ప్రొఫైల్ ఫొటోలను షేర్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. టాప్ రైట్ హ్యాండ్ కార్నర్ లో కనిపించే Share Button ద్వారా Profile Pic ను షేర్ చేసుకోవచ్చు. New Update తర్వాత షేర్ బటన్ Option ఇక కనిపించదు. ప్రస్తుతానికి ఈ వాట్సాప్ Beta యూజర్లకు ఈ ఫీచర్ అప్ డేట్ అందుబాటులోకి వచ్చేసింది. రెగ్యులర్ WhatsApp యూజర్లకు త్వరలో అందుబాటులోకి రానుంది.