• Tags
  • కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో ఈనెల 10న జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌ 16, 19 ఉమెన్‌ క్రికెట్‌ క్రీడాకారిణుల ఎంపిక నిర్వహించనున్నట్లు క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌.కె.కిరణ్‌రాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలకు క్రీడాకారుణులు సంబంధిత ధ్రువపత్రాలు, తెల్లటి దుస్తులతో హాజరుకావాలని కోరారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.